గుంటూరులో కఠినంగా లాక్‌డౌన్ అమలు - గుంటూరులో లాక్‌డౌన్‌ను వార్తలు
గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను అధికారులు కఠినంగా అమలుచేస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను నియంత్రిస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలు అమలవుతున్నాయి. పాజిటివ్ కేసులకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కఠిన ఆంక్షలతో పలు చోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరగటంతో... అధికారులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నారు. పాజిటివ్ కేసులకు ఆసుపత్రిలో చికిత్స అందించేలా, ఇదివరకే డిశ్చార్జి అయిన వారిని మళ్లీ హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో రోడ్లపై ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... బయటకి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో పరిస్థితులు, లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు.