ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటూరు రెడ్​జోన్​లో రేషన్ కోసం స్థానికుల అవస్థలు

గుంటూరు నగరం కొరిటీపాడులో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. ఫలితంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరకులు తమకు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Locals' plight for rationing in the guntur Red Zone
గంటూరు రెడ్​జోన్​లో రేషన్ కోసం స్థానికుల అవస్థలు

By

Published : Apr 16, 2020, 5:21 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ సరకులు తమకు అందడం లేదని గుంటూరు నగరం కొరిటీపాడు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఇద్దరికి కరోనా పాజిటివ్ నమోదు కాగా.. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. ఫలితంగా ఇక్కడ ఉండే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రెండో విడత రేషన్ సరకులు తమకు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల వద్దకు వెళితే అధికారులు వాలంటీర్లతో సరఫరా చేయిస్తామని చెప్పినప్పటికీ...వాలంటీర్లు బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. దీంతో సరకుల పంపిణీకి అవాంతరాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు సరకులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details