గుంటూరు జిల్లా రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ లో పని చేస్తూ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కిందపడి చనిపోయిన బిహార్ కు చెందిన లిఫ్ట్ ఆపరేటర్ల మృతదేహాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ సందర్శించారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్మాణ సంస్ద ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతదేహాలను వెంటనే వారి స్వస్థలాలకు పంపేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
లిఫ్ట్ ప్రమాద మృతదేహాలను పరిశీలించిన కలెక్టర్
గుంటూరు జిల్లా రాయపూడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కిందపడి చనిపోయిన బిహార్ వాసుల మృతదేహాలను కలెక్టర్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సహాయం అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
లిఫ్ట్ ప్రమాద మృతదేహాలను పరిశీలించిన కలెక్టర్