ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిని కొనసాగించకుంటే... పతనం తప్పదు' - capital news in ap

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని.... 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. గుంటూరు కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు 14వ రోజు కొనసాగాయి. అమరావతికి మద్దతుగా తెనాలిలో ఎంపీ గల్లా జయదేవ్ జోలె పట్టి విరాళాలు సేకరించారు.

కి మద్దతుగా జోలీపట్టి విరాళాలు సేకరణ
కి మద్దతుగా జోలీపట్టి విరాళాలు సేకరణ

By

Published : Jan 13, 2020, 5:36 PM IST

తెనాలిలో రాజధానికి మద్దతుగా జోలీపట్టి విరాళాలు సేకరణ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని... గుంటూరు కలెక్టరేట్ వద్ద రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా ఇంఛార్జీ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు అమరావతే రాజధానిగా ఉండాలని నినదించారు. మూడు రాజధానులకు మద్దతుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ర్యాలీ చేపట్టడాన్ని ఖండించారు. ప్రజలు ఒకటి కోరుతుంటే... వారు మరోలా ర్యాలీ చేయటం సరికాదన్నారు. సీఎం జగన్... అమరావతిని రాజధానిగా కొనసాగించకుంటే పతనం తప్పదని తెదేపా నేతలు పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలి: గల్లా
తెనాలి మార్కెట్​ సెంటర్​లో... 15 రోజులుగా 'మన అమరావతి-మన రాజధాని' అనే నినాదంతో దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు... మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు తెలిపారు. జోలెపట్టి విరాళాలు సేకరించారు. చందాలు అందించిన వారందరికి ధన్యవాదలు తెలిపారు. విరాళాలకు సమంగా గల్లా నగదు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను ఓడించాలన్నారు. తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించి... ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details