గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నేపాడు గ్రామానికి చెందిన సురేష్, ప్రసన్న దంపతులు తమ రెండేళ్ల చిన్నారి స్టెల్లాను తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... పున్నడిగుంట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో చిన్నారి లారీ చక్రాల కింద పడి, అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే తమ కూతురు లారీ చక్రాల కింద పడి, చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
విషాదం... లారీ చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి - గుంటూరు జిల్లా నేర వార్తలు
అమ్మ, నాన్న, చిన్నారితో ఆనందంగా గడిపేస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. తల్లిదండ్రులతో సరదాగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న రెండేళ్ల చిన్నారి లారీ చక్రాల కింద పడి మృత్యువాత పడింది. కళ్లెదుటే తమ కూతురు చనిపోవడం చూసి ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో జరిగింది.
larry-fell-and-killed-a-two-year-old-child-at-guntur-district