ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె పోలీస్​స్టేషన్ ఎదుట.. యువతి అంధ దీక్ష - lady protest

ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిపై ఫిర్యాదు ఇచ్చేందుకు వెళితే ఎస్సై తనను మానసికంగా వేధించాడంటూ భట్టిప్రోలుకు చెందిన యువతి ఆరోపించిది. ఎస్సైని సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయాలంటూ రేపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట అంధ దీక్ష చేపట్టింది.

'రేపల్లె పోలీస్​స్టేషన్ ఎదుట యువతి అంధ దీక్ష'

By

Published : May 17, 2019, 4:15 PM IST

3305710

గుంటూరు జిల్లా రేపల్లె పోలీస్​స్టేషన్​ ప్రాంగణంలో ఓ యువతి అంధ దీక్ష చేపట్టింది. ప్రేమ పేరుతో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి మోసం చేశాడని భట్టిప్రోలుకు చెందిన నళిని ఆరోపించింది. తాను ఇప్పడు గర్భవతిని అని... ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు భట్టిప్రోలు పోలీస్ స్టేషన్​కు వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్టేషన్​కు వెళ్లిన ప్రతిసారి ఎస్సై... ఇష్టం వచ్చినట్లు కులం పేరుతో దుర్భాషలాడారని ఆరోపించింది. తనను మానసికంగా వేధించిన ఎస్సై మన్మధరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అప్పటి వరకూ నిరసన కొనసాగిస్తానని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details