అటవీ శాఖ అధికారిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు - women
లైంగికంగా వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి మోహన్ రావుపై ఓ మహిళ గుంటూరు అర్బన్ పోలీసులకు పిర్యాదు చేశారు.
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ అటవీ శాఖ అధికారిపై పోలీసులకు పిర్యాదు చేశారు. క్లర్క్ పోస్టు కోసం 2 లక్షలు చెల్లించానని.... ఉద్యోగం ఇవ్వకపోగా... డబ్బులు కూడా ఇవ్వడం లేదని బాధిత మహిళ ఆరోపించారు. డబ్బులు కోసం వెళ్తే తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆమె గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనలాగే చాలామంది మహిళలు డి.ఎఫ్.ఓ చేతిలో మోసపోయినట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఈ మహిళ... ఐద్వా సంఘం ఆధ్వర్యంలో అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు.