రేషన్ సరుకుల కోసం గుంటూరులో చౌకధరల దుకాణాల ముందు ప్రజలు పడిగాపులు కాశారు. తెల్లవారుజామున 3గంటలకు క్యూ లో నిలుచుంటే పట్టించుకునే నాథుడే లేడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందిపప్పు, బియ్యంతోనే అధికారులు బతుకుతున్నారా? తమకు మాత్రం ఇవి ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొందాం అనుకుంటున్నారంటూ... వృద్ధులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రేషన్ దుకాణాల ముందు జనాలు కిక్కిరిసిపోతుంటే లాక్డౌన్ పెట్టడంలోని లక్ష్యం నీరుగారిపోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తే ఈ సమస్యలు తలెత్తవని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు.. తాడికొండ నియోజకవర్గం శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి మాస్కులు, కూరగాయలు మేడికొండూరు మండలం పేరేచర్లలో పంపిణీ చేశారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు.