గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు(Kopparru incident)లో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిన శారదా ఇంటిపై దాడులకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెదేపాకు చెందిన 50 మందిపై, వైకాపాకు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. దీనిపై తెదేపా నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు.
KOPPARRU INCIDENT: 50మంది తెదేపా, 19మంది వైకాపాకు చెందినవారిపై కేసు
కొప్పర్రు ఘటన(Kopparru incident)కు సంబంధించి తెదేపాకు చెందిన 50 మందిపై, వైకాపాకు చెందిన 19 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Kopparru incident
బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన పోలీసులు.. ఘటనకు సంబంధం లేని వారిపై, పరామర్శకు వచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొప్పర్రులో ఘటన జరిగిన ప్రదేశాన్ని గుంటూరు అదనపు ఎస్పీ రిషాంత్ రెడ్డి పరిశీలించారు. శారదా, వేణు దంపతులతో మాట్లాడారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు రూరల్ సీఐ శ్రీనివాసులు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం