గుంటూరు జిల్లాలో కొండవీటివాగు, అమరావతి ప్రాంతంలోని పాలవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో పంటపొలాలు నీటమునిగాయి. రెండు వాగుల్లోను వరద ఉద్ధృతి పెరగటంతో.. ప్రకాశం బ్యారేజీ కుడివైపున ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులను జలవనరుల శాఖ అధికారులు ఆన్ చేశారు. మూడు పంపుల ద్వారా వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. దాదాపు 1500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటిమట్టం 57 అడుగులు మించిపోవటంతో... రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నా, కొండవీటివాగు ఎత్తిపోతల ద్వారా నీటిని బ్యారేజీలోకే ఎత్తిపోస్తున్నారు.
ఉప్పొంగుతున్న కొండవీటివాగు, పాలవాగు
గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, పాలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. పంట పొలాలు నీటమునిగాయి. కొండవీటివాగు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి.. ప్రకాశం బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఉద్ధృతంగా కొండవీటి వాగు
TAGGED:
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం