Karakatta Kamalhasan : ఏమైందో ఏంటో! కరకట్ట కమల్‌హాసన్ ఉన్నట్టుండి పాత పల్లవితో కొత్త రాగం అందుకున్నాడు. 'అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట' అనే పాట గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుని అడుగులో అడుగులు వేస్తున్నాడు. మంగళగిరి 'స్వాతిముత్యం' మనసు ఎందుకు విరిగింది? మా 'కనకాంబరం' వీరాభిమాని 'ఏకాంబరమే' ఇలా దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే ఇక మా పరిస్థితి ఏంటి ? అని మిగతా నటీనటులంతా ఆందోళనకు గురవుతున్నారు. కరకట్ట కమల్‌హాసన్‌కు ఏమైందీ వేళ? ఇక పార్టీ పరిస్థితి, రాష్ట్రం భవిష్యత్ ఏమిటి 'జలగన్నా'? క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ప్రజలంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
3వేల కిమీ మైలు రాయిని అధిగమించిన యువగళం - పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ, దేవాన్ష్
ఆణిముత్యాల్లాంటి సన్ని'వేషాలు'
కరకట్ట కమల్‌హాసన్ మరో ఘట్టానికి తెరతీసిన వేళ గతంలో ఆయన అత్యద్భుతంగా నటించి మెప్పించిన సన్ని'వేషాల్ని' నియోజకవర్గ ప్రజానీకం ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ రికార్డులు కూడా చెరపలేకపోయినా ఆ సన్నివేశాలు, 'ఆస్కార్ కూడా తక్కువే' అనిపించే ఆ నవరస నటనను మర్చిపోలేకపోలేక బెంగపెట్టుకుంటోంది. పది రూపాయలకే కూరగాయలు పంచిన ఆ దానకర్ణుడికి ఏమైందని కుమిలిపోతోంది. కలల రాజన్న క్యాంటీన్లు పెట్టి కడుపు నింపిన మా నాయకుడు ఎక్కడా అని పేద ప్రజానీకం కరకట్టపై గాలిస్తోంది. కొండల్ని పిండి చేసిన (మట్టి మాఫియా) మా బాహుబలికి ఏమైంది? అని రోదిస్తోంది. 'అన్న నడిచొస్తే మాస్, అన్న వరి నాట్లేస్తే మాస్, అన్న పచ్చ గడ్డి మోసుకొస్తుంటే మాస్' ఆణిముత్యాల్లాంటి ఆ సన్నివేశాలు ఏవీ? ఆ బాల గోపాలాన్ని అలరించిన ఆ నటసార్వభౌముడు కరకట్ట కమల్‌హాసన్ ఎక్కడా? అని అణువణువూ గాలిస్తోంది.
కమల్‌హాసన్‌కే నచ్చలేదు కామన్ మ్యాన్‌కు నచ్చుతాడా?!
జలగన్న అంటే కమల్‌హాసన్‌కు పిచ్చి. గుండెల్లో కట్టుకున్న అన్న కోసం ఏదైనా చేస్తాడు. తన గుండెను తీసి ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు. అంతటి వీరాభిమాని. మరి ఇప్పుడు ఆత్మ, శరీరం వేరయ్యిందే! పెద్ద కష్టమే వచ్చి పడిందే! కమల్‌హాసన్‌కే నచ్చని జలగన్న ఇక కామన్ పీపుల్‌కు ఏం నచ్చుతాడు?