ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 15, 2020, 12:25 PM IST

ETV Bharat / state

'వైకాపా ఎన్డీయేలో చేరే విషయం తెలియదు'

వైకాపా ఎన్డీయేలో చేరే విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని.. తెదేపా, వైకాపాలకు సమదూరం పాటించాలనే తమ పార్టీ నిర్ణయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్​షాలతో సీఎం జగన్ పాలనాపరమైన అంశాలే చర్చించినట్లు తాను భావిస్తున్నామన్నారు.

kanna lakshminarayan talks about ycp will join NDA
వైకాపా ఎన్డీయేలో చేరుతుందన్న వార్తలపై కన్నా లక్ష్మీనారాయణ స్పందన

వైకాపా ఎన్డీయేలో చేరుతుందన్న వార్తలపై కన్నా లక్ష్మీనారాయణ స్పందన

వైకాపా ఎన్డీయేలో చేరే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తెలుగుదేశం, వైకాపాలకు సమదూరం పాటించాలనేదే తమ పార్టీ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే ప్రధాని మోదీ, అమిత్‌షాలతో సీఎం జగన్‌ భేటీ అయ్యుంటారన్నారు. వారి సమావేశంలో పరిపాలనాపరమైన అంశాలకే తప్ప రాజకీయ చర్చలు ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తాను అనుకున్నది చేయటం తప్ప ఏ విషయం బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.

కడపలో తమ పార్టీ నేతలపై దాడులు చేసి ఎదురు కేసులు పెట్టారని.. ఇసుక దందాను అడ్డుకున్నందుకు భాజపా ఎస్టీ విభాగం ఇంఛార్జ్ సత్యనారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు బనాయించారని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఈనెల 19న కడపలో ధర్నా నిర్వహించనున్నట్లు కన్నా వెల్లడించారు.

ఇవీ చదవండి..హోంమంత్రి అమిత్​షాతో సీఎం జగన్​ చర్చించిన అంశాలివే..!

ABOUT THE AUTHOR

...view details