ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు దశాబ్దాల సేవకు దక్కింది శూన్యం... అయినా... - arist

ఆయన నాటకాన్ని నమ్ముకున్నారు. నచ్చిన నాటకానికి... తనకు వచ్చిన సంగీతంతో పట్టం కట్టారు. కొత్త వినోదాలు ఎన్ని వచ్చినా... నాలుగు దశాబ్దాలుగా నాటక రంగంలో కొనసాగుతున్నారు. సాంఘిక, పద్య నాటకాలకు కీబోర్డు ప్లేయర్‌గా వాయిద్య సహకారం అందిస్తూ... తన ప్రతిభ ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

kalakarulu

By

Published : Sep 27, 2019, 1:09 PM IST

Updated : Sep 27, 2019, 1:47 PM IST

నాలుగు దశాబ్దాలుగా నటక రంగంలో ఎనలేని ప్రతిభ..కానీ...

నేపథ్య గాయకుడిగా,కీబోర్డు ప్లేయర్‌గా సేవలు …

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాంబశివరావుకు చిన్ననాటి నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం.పాఠశాల స్థాయి నుంచే నాటకాలు వేయటం ప్రారంభించారు.పెద్దయ్యాక కూడా పూర్తిస్థాయిలో నాటక రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఆయన మధుర కంఠం అందుకు తోడ్పడింది.నాటకాల్లో నేపథ్యగానం చేయటంతో పాటు సంగీత సహకారం కూడా అందించేవారు.కీబోర్డు ప్లేయర్‌గా నాటక రంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగారు.ఈ సుధీర్ఘ ప్రయాణంలో6వేలకు పైగా నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాల్లోనూ సాంబశివరావు పాల్గొన్నారు.ఈ క్రమంలో ఉత్తమ సంగీతం విభాగంలో ఆరు నంది అవార్డులు గెలుచుకున్నారు.

ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలి...

ఇన్ని సంవత్సరాల సంగీత ప్రయాణం....సాంబశివరావుకు ఆర్థికంగా కలిసి రాకపోయినా ఆత్మ సంతృప్తి మాత్రం ఇచ్చింది.యువతలో కూడా నాటకాల పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చొరవ చూపాలని,తరచుగా నాటకోత్సవాలు జరపాలని సాంబశివరావు కోరుతున్నారు.వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇవ్వటంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాటకాల్లో ఇంకా సాంకేతికత పెరగాలని,కళాకారులకు పారితోషికం పెంచాలని కోరుతున్నారు.నాటక రంగం కోసం సాంబశివరావు నిరంతరం తపించేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

కళాకారులకు అవకాశాలు కల్పించటంతో పాటు వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని సాంబశివరావు కోరుతున్నారు. అప్పుడే నాటక రంగం మరింత వృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Sep 27, 2019, 1:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details