ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ప్రజానాట్య మండలి కళాకారులు ఆవేదన చెందారు. ఆర్నెల్లుగా తమకు పింఛను అందడం లేదన్నారు. ప్రభుత్వం పెంచిన పింఛన్ తో పాటు తక్షణం చెల్లింపులు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయకుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ నుంచి జడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మీకోసం లో అధికారులకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం స్పందించకుంటే నాలుగు వారాల తరువాత కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
పెంచిన పింఛన్‌ను తక్షణమే అందించండి: ప్రజానాట్యమండలి - pension
6 నెలలుగా పింఛన్ ఇవ్వని కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని రాష్ట్ర ప్రజా నాట్యమండలి సభ్యులు ఆరోపించారు. కళాకారులకు ప్రభుత్వం పెంచిన పింఛన్ మొత్తాన్ని తక్షణమే అందించాలని కోరారు.
పెంచిన పింఛన్ ను తక్షణమే అందించండి: ప్రజా నాట్యమండలి