ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అప్పటి వరకు పార్టీ జెండా ముట్టుకోను' - షౌకత్

గుంటూరు తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ఆశించిన తెలుగుదేశం పార్టీనేత షౌకత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేస్తోన్న షౌకత్​ను కాదని, వైకాపా నుంచి వచ్చిన నసీర్‌ను అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని కార్యకర్తలు నిరసన తెలిపారు.

తెదేపా నేత షౌకత్

By

Published : Mar 16, 2019, 7:08 AM IST

గుంటూరు తూర్పు టికెట్ నాకే కావాలి!
గుంటూరు తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ఆశించిన తెలుగుదేశం నేత షౌకత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.తెదేపా అభ్యర్థిగా నసీర్ అహ్మద్​ నియామకాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయన అభిమానులుపార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీలో కష్టపడి పనిచేస్తోన్న షౌకత్​ను కాదని...వైకాపా నుంచి వచ్చిన నసీర్ అహ్మద్‌కు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూకార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అలకబూనిన షౌకత్​ను బుజ్జగించేందుకు ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి గిరిధర్ ప్రయత్నించారు.పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని...కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని ఎంపీ జయదేవ్ సర్దిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details