జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనసేన స్వాగతించింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మొదటి నుంచి నిర్వహించాలని.. జనసేన రాష్ట్ర నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన తీర్పు తమ తొలి విజయంగా భావిస్తున్నామన్నారు.
ఎన్నికలు సజావుగా జరగాలన్న ఉద్దేశంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వివరించారు. గతేడాది నోటిఫికేషన్ను కొనసాగించటం వల్ల తమ నేతలు పూర్తి స్థాయిలో పోటీ చేయలేకపోయారని గుర్తు చేశారు. అందుకే మళ్లీ మొదట్నుంచి ఎన్నికల ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.