ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన ఆవిర్భావ సభ కోసం చురుగ్గా ఏర్పాట్లు

Janasena Party Avirbhava Sabha Arrangements: ఈనెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈమేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Janasena Party Avirbhava Sabha Arrangements
Janasena Party Avirbhava Sabha Arrangements

By

Published : Mar 12, 2022, 5:01 AM IST

జనసేన ఆవిర్భావ సభ కోసం చురుగ్గా ఏర్పాట్లు

Janasena Avirbhava Sabha: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్‌ తెలిపారు. రాజకీయంగా జనసేన వైఖరిని ఇదే వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు. ఈనెల 14న నిర్వహించినున్న ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'జన జన జన జనసేనా' అనే గీతాన్ని, గోడ పత్రికనూ ఆయన ఆవిష్కరించారు.

సభా ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబు పరిశీలించారు.

ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీల్లో నియామకాలు..

జనసేన ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు నాదేళ్ల మనోహర్​ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సమన్వయ కమిటీలో 8 మంది, సెక్యూరిటీ కమిటీలో11 మంది, మీడియా కో ఆర్డినేటర్​ కమిటీలో ఆరుగురు, వాలంటీర్ల కమిటీలో ముగ్గురు, మెడికల్​ అసిస్టెన్స్, ప్రచార కమిటీలో ఒక్కొక్కరి చొప్పున నియమించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. చాలా మంది పోటీలో ఉన్నారన్న సీఎం జగన్..!

ABOUT THE AUTHOR

...view details