ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JANASENA: నిరుద్యోగుల సమస్యలపై జనసేన పోరాటం.. నేతల గృహ నిర్భంధం - కర్నూలులో జనసేన నేతల ముందస్తు గృహనిర్భంధం

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. నేడు ఉపాధి కల్పనా కార్యాలయాలలో వినతి పత్రం అందజేయనున్నట్లు జనసేన పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరులో పలువురు జనసేన నేతలను.. బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. కొందరు నాయకులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే గృహనిర్బంధాలు చేస్తారా అని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

janasena leaders house arrests
జనసేన నేతల ముందస్తు గృహనిర్భంధం

By

Published : Jul 20, 2021, 10:05 AM IST

Updated : Jul 20, 2021, 12:04 PM IST

జనసేన నేతల ముందస్తు గృహనిర్భంధం

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పనా కార్యాలయాల్లో.. వినతిపత్రం ఇవ్వాలని జనసేన పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ నేతల ఇంటి వద్ద పోలీసులు బందోస్తు ఏర్పాటు చేసి.. ముందస్తు గృహనిర్బంధం చేశారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే.. వారిపై కేసులు పెడతామంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

బాసటగా నిలిస్తే గృహనిర్బంధాలు చేస్తారా: నాదెండ్ల మనోహర్

నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే గృహనిర్బంధాలు చేస్తారా అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. మోసపోయిన నిరుద్యోగులకు జనసేన బాసటగా నిలిస్తే సీఎం ఇబ్బంది పడుతున్నారని మనోహర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ఆయా జిల్లాల ఉపాధి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని జనసేన చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు, జన సైనికులను నిన్న రాత్రి నుంచి గృహ నిర్భంధాల్లో ఉంచడం అప్రజాస్వామికమన్నారు.

‘‘ప్రజాస్వామ్యంలో వినతిపత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం కచ్చితంగా నియంతృత్వ పోకడే అవుతుంది. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేసి అమలు చేయమంటే ఇబ్బంది కలుగుతోందా?ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసినా జనసేన పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తుంది’’ -నాదెండ్ల మనోహర్.

గుంటూరు, జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలను.. పోలీసులు ముందస్తు గృహనిర్బంధం చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్ సమీపంలోని జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

కర్నూలు జిల్లా ఆదోనిలోనూ జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్తున్న ఆ పార్టీ నాయకులను జనసేన కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

PAWAN: ఉన్న ఉద్యోగాలూ యువతకు ఇవ్వరా?: పవన్ కల్యాణ్

Last Updated : Jul 20, 2021, 12:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details