తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్.. 'జయహో' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రస్థానం పేరిట జగన్ చేసిన పాదయాత్ర విశేషాలతో జయహో పుస్తకం రూపొందింది. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి... జయహో పుస్తకాన్ని సంకలనం చేశారు.
3648 కిలో మీటర్లు పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని... ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే 50 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.