వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక ఖరారైంది. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఈనెల 30న మధ్యాహ్నం12.23గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు. గవర్నర్ సహా ముఖ్యులు హాజరవుతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
కార్యక్రమానికి వచ్చేవారికి5కేటగిరీలుగా పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు.స్టేడియంలోకి 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.ఎండల దృష్ట్యా స్టేడియంలో ఏసీలు,కూలర్లు,తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.స్టేడియం వెలుపల ఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.