ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్టు ఖర్చులను జగన్ వ్యక్తిగతంగా భరించాలి: వర్ల

హైదరాబాద్​లోని సీబీఐ కోర్టుకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చులన్నీ జగన్‌ తన సొంత ఖాతా నుంచే భరించాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కోర్టు ఖర్చుల వివరాలను సీఎస్‌ బహిర్గతం చేయాలని కోరారు. అలాగే సీఎం స్థానంలో సీనియర్ మంత్రిని ఇన్​ఛార్జ్​గా నియమించాలని అన్నారు.

varla ramaiah
వర్ల రామయ్య

By

Published : Jan 9, 2020, 11:45 PM IST

మీడియా సమావేశంలో వర్ల రామయ్య

రేపు సీబీఐ కోర్టుకు జగన్​మోహన్ రెడ్డి హాజరయ్యేది వ్యక్తిగత హోదాలోనా?... అధికారిక హోదాలోనా? అని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చులన్నీ జగన్​మోహన్ రెడ్డి సొంత ఖాతా నుంచే భరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోర్టు ఖర్చుల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బహిర్గతం చేయాలన్నారు. భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు ముద్దాయిగా వెళ్లింది జగన్​ మోహన్ రెడ్డేనని ఆయన విమర్శించారు. కేసుల విచారణలో భాగంగా పాలనను జగన్‌ గాలికి వదిలేస్తే ఎలా అని నిలదీశారు. సీఎం స్థానంలో సీనియర్ మంత్రిని ఇన్​ఛార్జ్​గా నియమించాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. అవినీతి కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details