ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు సూచించిన వారికే జనసేన టిక్కెట్లు' - tdp

'చంద్రబాబు నాయుడు ఏది చెబితే ఆయన పార్ట్​నర్, యాక్టర్ అదే వల్లిస్తాడు. తెదేపా అధినేత చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తాడు' - చిలకలూరిపేటలో జగన్

చిలకలూరిపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్

By

Published : Mar 24, 2019, 6:06 PM IST

Updated : Mar 24, 2019, 6:36 PM IST

చిలకలూరిపేటలో జగన్ రోడ్​షో
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రోడ్​షోలో చంద్రబాబు, పవన్​పై జగన్ ఘాటు విమర్శలు చేశారు. పవన్​ని పరోక్షంగా యాక్టర్​ అని సంభోదిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రజల్లో తెదేపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు... పవన్​తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 'చంద్రబాబు నాయుడు ఏది చెబితే ఆయన పార్ట్​నర్, యాక్టర్ అదే వల్లిస్తాడు. తెదేపా అధినేత చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తాడు' అని విమర్శించారు. పవన్ నామినేషన్​ కార్యక్రమంలో తెలుగుదేశం జెండాలు కనిపించాయని విమర్శించారు.ప్రజాశాంతి పార్టీని ప్రస్తావించిన జగన్
చిలకలూరిపేట రోడ్​షోలో ప్రజాశాంతి పార్టీపై కూడా జగన్ విమర్శలు చేశారు. 'కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి... ఆ పార్టీల కండువాలు కూడా వైకాపా కండువాల మాదిరిగానే ఉన్నాయి. వాళ్లందరికీ చంద్రబాబు నాయుడు డబ్బులిచ్చి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు' అని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

Last Updated : Mar 24, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details