ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫోన్‌ చేసిన 24 గంటల్లోగా వైద్యసేవలందించండి' - ఏపీలో కరోనా వైరస్ వార్తలు

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని క్వారంటైన్​ కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు.

cm jagan
cm jagan

By

Published : May 8, 2020, 4:58 PM IST

టెలీ మెడిసిన్‌ను సమర్థంగా అమలు చేయాలని సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. ఫోన్‌ చేసిన 24 గంటల్లోగా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చిన 24 గంటల్లో మందులు అందించాలన్నారు. కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి... పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. నిత్యం కరోనాయేతర కేసులు ఎన్ని వస్తున్నాయో వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పీహెచ్‌సీ సిబ్బందికి బైక్‌, థర్మో బ్యాగ్‌ అందుబాటులో ఉంచాలన్నారు. వెంటనే బైకులు కొనుగోలు చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు.

కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారికి పరీక్షలు పూర్తి చేశామన్న అధికారులు... విదేశాల్లో చిక్కుకున్న వారు రావడం ప్రారంభమైందని చెప్పారు. గల్ఫ్‌, యూకే, అమెరికా నుంచీ కొందరు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే వారందరినీ క్వారంటైన్‌ కేంద్రాలకు పంపాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ షెల్టర్లు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు బాగుండేలా చూడాలన్నారు. ఈనెల 30న రైతుభరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామన్న అధికారులు చెప్పగా... పథకంలో మిగిలిపోయిన వాళ్లు ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం అన్నారు. ఈనెల 11న గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details