ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 82 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టగా మేడికొండూరు నుంచి పేరేచర్ల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆపారు. అనుమానం వచ్చి సోదా చేయగా.... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని గుర్తించారు. సరకును, వాహనాన్ని సీజ్ చేసి.. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - గుంటూరు జిల్లా వార్తలు
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు పట్టుకున్నారు. 82 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత