న్యాయం చేయమని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తనతో అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు, కేసు నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ.. అరండల్‌పేట సీఐపై ఓ యువతి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్తే.... కేసు నమోదు చేయకుండా సీఐ శ్రీనివాసులు తనను ఇబ్బందులు పెడుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. పైగా తనను మోసం చేసిన వ్యక్తి దగ్గర సీఐ లంచం తీసుకుని... కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని వాపోయింది. సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసింది.
న్యాయం కోసం వెళితే... సీఐ అసభ్యంగా ప్రవర్తించాడు..! - సీఐ పై యువతి పిర్యాదు
న్యాయం చేయమని పోలీస్ స్టేషన్‌కు వెళితే గుంటూరు జిల్లా అరండల్ పేట సీఐ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. ఓ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అతనిపై చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది.
న్యాయం కోసం వెళితే...అసభ్యంగా ప్రవర్తించాడు