ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాక ప్రోటోకాల్ పేరుతో ఎన్నో ఆంక్షలు ఎదుర్కొంటున్నట్లు వెంకయ్యనాయుడు వాపోయారు. గుంటూరు క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తీరకలేని కారణంగా విద్యార్థులతో సమావేశాలు, సాంకేతిక విద్యా, పరిశోధన సంస్థల సందర్శన, వ్యవసాయం, రైతు సంబందిత కార్యక్రమాలు వంటి 5 రంగాలను ఎంచుకొని వాటిపై ప్రత్యేక దృష్టి సారించనన్నారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల్లో పెరిగిన ధనప్రవాహం
ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా పెరిగిందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కులం, మతం, డబ్బు, నేరస్వభావం ఉన్నవారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. రాజకీయ నాయకుల భాష, మాటలు దిగజారాయన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలను గౌరవించాలని సూచించారు.