గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కట్టుకున్న భార్యనే ఇనుపరాడ్‌తో కొట్టి కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన వెంకట్రావు, సీతారావమ్మలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. గత నాలుగేళ్ల నుంచి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితమే సీతారావమ్మ భర్త దగ్గరకు వచ్చి ఉంటుంది. నిన్న రాత్రి రక్తపు మడుగులో పడి ఉన్న సీతారావమ్మను చూసి స్థానికులు.. 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భర్త - prathipadu latest news
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య తలపై ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
husband-killed-wife-in-guntur-prathipadu
Last Updated : Nov 15, 2019, 10:08 AM IST