ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.500 నోటు.. అసలైందేనా..? నకిలీదా..? ఎలా తెలుసుకోవడం? - తెలంగాణ క్రైం న్యూస్

identify original currency notes and fake currency notes: ఓ వైపు సైబర్​ నేరాలు, మరో వైపు ఆన్​లైన్​ మోసాలు, మధ్యలో కాల్​గర్ల్స్​ పేరుతో డబ్బులు టొకారాలు.. ఇలా రోజుకో కొత్త మోసాలు వెలుగు చూస్తున్న తరుణంలో.. తాజాగా ఏపీలో గ్రామ వాలంటీర్లు ఫించన్ల డబ్బుల్లో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి పంచిన ఘటన ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఇంతకి నకిలీ నోట్లు, అసలు నోట్లు గుర్తించడం ఎలా..? ఆర్బీఐ వాటిని చెక్​ పెట్టడానికి ఎలాంటి మార్గదర్శకాలు చేసింది.

రూ.500 నోటు.. అసలైందేనా..?
రూ.500 నోటు.. అసలైందేనా..?

By

Published : Jan 5, 2023, 4:37 PM IST

Identify original currency notes and fake currency notes: కొత్త కరెన్సీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత నకిలీ నోట్ల బెడద తగ్గిందనుకున్నాం.. మళ్లీ నకిలీలు చలామణిలోకి వస్తున్నాయి. ఎక్కువగా పెద్దనోట్లలోనే నకిలీలు కనిపిస్తాయి. ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్‌ వృద్ధులకు ఇచ్చే పింఛనులో నకిలీ నోట్లను పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. అసలు ఈ నోట్లలో అసలుకు, నకిలీకి తేడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

₹500 ఒరిజినల్‌ నోటు ఎలా ఉంటుందంటే:

  • ముందుభాగంలో నోటు ఎడమవైపు కిందిభాగంలో తెలుపు, గోధుమవర్ణంలో 500 సంఖ్య కనిపిస్తుంది.
  • నోటుని 45 డిగ్రీల కోణంలో వంచి చూసినట్లయితే.. నోటు కిందిభాగంలో ఉన్న ఆకుపచ్చ స్ట్రిప్‌లో 500 సంఖ్యని గమనించవచ్చు.
  • స్ట్రిప్‌ పైన 500 సంఖ్య దేవనాగరి లిపిలో రాసుంటుంది.
  • నోటు మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రపటం కనిపిస్తుంది.
  • నోటును వంచి చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే భద్రతా తీగ.. నీలంలోకి మారుతుంది.
  • భద్రతా తీగ కుడివైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంతకం, దానికింద ఆర్‌బీఐ చిహ్నం ఉంటాయి.
  • దాని పక్కనే 500 సంఖ్య ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌ను గమనించొచ్చు.
  • నోట్ల సిరీస్‌ను తెలియజేసే సంఖ్యలు కుడివైపు కిందిభాగంలో ఎడమ నుంచి కుడికి సైజు పెరుగుతూ కనిపిస్తాయి.
  • నోటు కుడివైపు కిందిభాగం చివరన భారత జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ ఉంటుంది.
  • వెనక భాగంలో ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
  • స్వచ్ఛభారత్‌ నినాదంతో కూడిన లోగో కనిపిస్తుంది.
  • దేశంలోని 15 భాషల్లో నోటు విలువను పేర్కొంటూ లాంగ్వేజ్‌ ప్యానెల్‌ ఉంటుంది.
  • లాంగ్వేజ్‌ ప్యానెల్‌ పక్కనే దిల్లీలోని ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది.
  • వీటిని పరిశీలించిన తర్వాత మీ వద్ద ఉన్న నోటు ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఏదైనా బ్యాంకు సిబ్బందిని సంప్రదించింది.. అసలుదా.. నకిలీదా నిర్థారించుకోండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details