ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాభాసాగా మారిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

గుంటూరు జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. ముఖ్య అతిథిగా హాజరైన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి.. సభ వద్దకు వెళుతుండగా స్థానిక మహిళలు అడ్డుకోబోయారు. అర్హత ఉన్నా తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

house sight contrevarsy
రసాభాసాగా మారిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం

By

Published : Jan 3, 2021, 6:40 AM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసాగా మారింది. ముఖ్య అతిథిగా హాజరైన తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతున్న సమయంలో గ్రామానికి చెందిన మహిళలు అడ్డు తగిలారు. తమకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆందోళన చేశారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నా స్థలం ఇవ్వ లేదని వాపోయారు. అర్హత లేని వారికి మంజూరు చేశారని మండిపడ్డారు. గ్రామంలోని వైకాపా నాయకులు ఇష్టం వచ్చిన వారికి స్థలాలు ఇప్పించారాన్నారు. గతంలో కొందరికి ఇళ్ల పట్టాలిచ్చారని... తమకు ఇళ్లు కట్టుకునే స్తోమత లేదని తెలిసి.. అవే స్థలాలను మరి కొందరికి ఇచ్చారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారు సభా ప్రాంగణం వద్దకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

శిలాఫలకం ధ్వంసం

కండ్రికలో వైయస్సార్​ జగనన్న కాలనీ పేరిట ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. అదే రోజు గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరిగింది. అర్హులైన తమకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మంగళగిరి, నవులూరులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details