ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమానుషం : కరోనా బాధితుల్ని ఇంట్లో పెట్టి తాళం వేసిన యజమాని - కొవిడ్ బాధితుల్ని ఇంట్లో పెట్టే తాళం వేసిన యజమాని

కరోనా మనుషుల్ని కర్కశంగా మార్చేస్తుంది. మానవత్వాన్ని చంపేస్తుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చిందని... కుటుంబం మొత్తాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసింది యజమాని. ఎంత బతిమాలినా తాళం తీయలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు యజమానిని హెచ్చరించి తాళం తీయించారు.

అమానుషం : కరోనా బాధితుల్ని ఇంట్లో పెట్టి తాళం వేసిన యజమాని
అమానుషం : కరోనా బాధితుల్ని ఇంట్లో పెట్టి తాళం వేసిన యజమాని

By

Published : Jul 25, 2020, 11:38 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధిత కుటుంబం పట్ల ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించారు. సత్తెనపల్లి పట్టణంలోని పోలేరమ్మ గుడి బజారులో ఉండే ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆ యువకుడు హోం ఐసోలేషన్ లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. విషయం తెలిసిన ఆ ఇంటి యాజమాని..యువకుడి కుటుంబాన్ని ఇంట్లో ఉండగానే బయట తాళం వేసింది.

దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి వాళ్లంతా ఇంట్లోనే ఉండిపోయారు. అయితే యువకుడి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని... ఇంటి యజమానిని హెచ్చరించి తాళాలు తీయించారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో నెలకొన్న భయం వారిలోని మానవత్వం కోల్పోయేలా చేస్తోంది. అందుకు సత్తెనపల్లిలో జరిగిన ఘటనే నిదర్శనం.

ఇదీ చదవండి :'చనిపోయి 3 రోజులైనా సమాచారమివ్వలేదు...డబ్బులు బారీగా దండుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details