గుంటూరులో బాలికపై అత్యాచారం అత్యంత బాధాకరమని.... రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బాధితురాలిని పరామర్శించిన ఆమె... బాలిక కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షలు, చదువు నిమిత్తం రూ.2 లక్షలు, ఫోక్సో చట్టం క్రింద 25 వేలు, ఎస్సీఎస్టీ అట్రాసీటీ క్రింద 2.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. మహిళలకు రక్షణగా ప్రవేశపెట్టిన దిశ చట్టాన్నిసాధ్యమైనంత త్వరగా ఆమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుటుందన్నారు.
అత్యాచార బాధితురాలికి హోంమంత్రి పరామర్శ - మైనర్ బాలిక పై అత్యాచారాన్ని తీవ్రంగా ఘడిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత
గుంటూరులో అత్యాచార బాధితురాలిని హోం మంత్రి సుచరిత పరామర్శించారు. దారుణాన్ని ఖండించారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి