ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేపల్లె ఘటన'లో జరిగిందిదే.. అత్యాచారం నిందితుల ఉద్దేశ్యం కాదు: హోంమంత్రి

రేపల్లె అత్యాచార ఘటనకు హోంమంత్రి వనిత కొత్త భాష్యం చెప్పారు. బాధితురాలి భర్త వద్ద దొంగతనానికి యత్నించిన నిందితులు... మత్తులో అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు చెప్పారు. పిల్లల పెంపకమే సరిగా ఉండటం లేదని విశాఖపట్నంలో ఆమె మాట్లాడి చర్చలకు తావిచ్చారు.

'రేపల్లె ఘటన'లో జరిగిందిదే.. అత్యాచారం నిందితుల ఉద్దేశ్యం కాదు
'రేపల్లె ఘటన'లో జరిగిందిదే.. అత్యాచారం నిందితుల ఉద్దేశ్యం కాదు

By

Published : May 3, 2022, 5:37 PM IST

Updated : May 4, 2022, 6:16 AM IST

'రేపల్లె ఘటన'లో జరిగిందిదే.. అత్యాచారం నిందితుల ఉద్దేశ్యం కాదు

రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కొన్ని సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పిల్లల పెంపకమే సరిగా ఉండటం లేదని విశాఖపట్నంలో ఆమె మాట్లాడి చర్చలకు తావిచ్చారు. మంగళవారం గుంటూరులో రేపల్లె అత్యాచార ఘటనపై స్పందించిన తీరూ చర్చలకు అవకాశం కల్పించింది. ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘అత్యాచారానికి పాల్పడినవారు అసలు అమ్మాయిపై అత్యాచారం చేయాలని రాలేదు. వాళ్లు తాగి ఉన్నారు. డబ్బుల కోసం భర్తపై దాడి చేశారు. భర్తను రక్షించుకోవటానికి ఆ అమ్మాయి వెళ్లినప్పుడు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికి గురైంది. పేదరికంవల్లో, మానసిక పరిస్థితులవల్లో అప్పటికప్పుడు కొన్ని అనుకోని రీతిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి..’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు, పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. శాఖలో కొరత కొంత ఉన్నది వాస్తవమేనని చెప్పారు. పోలీసుల కొరతపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Last Updated : May 4, 2022, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details