హోంమంత్రి సుచరిత గుంటూరు జిల్లాలో పర్యటించారు. కాకుమానులో రూ.18లక్షలతో నిర్మించ తలపెట్టిన మైక్రో వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ... సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో కేవలం విద్య మాత్రమే బోధించకుండా... మానసిక వికాసం, విలువల గురించి చెప్పాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా 50వేల మంది విద్యార్థులు చేరడం గొప్ప విషయమన్నారు.
'ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా... సర్కారు బళ్లు' - Guntur District news
అక్షరాస్యత శాతంలో దేశ సగటు కంటే... రాష్ట్ర సగటు తక్కువగా ఉందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. అమ్మఒడి పథకం ద్వారా చదువుకునే వారందరికీ అండగా ఉంటామని చెప్పారు. పదో తరగతి, ఇంటర్ తప్పిన వారితో ప్రైవేట్ పాఠశాలల్లో బోధన చేయిస్తున్నారన్న ఆమె... ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు చదువు చెబుతారన్నారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత