ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలు ఆదాయ వనరు కాదు.. పనికి పంపొద్దు: సుచరిత

పిల్లలను పనికి పంపిస్తూ వారిని ఆదాయ వనరుగా భావించే వైఖరిని తల్లిదండ్రులు విడనాడాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెట్టిచాకిరీ నుంచి వీధిబాలలు, బాలకార్మికులను విముక్తి చేసేందుకు ఇకపై ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించనుందని చెప్పారు.

By

Published : Nov 14, 2020, 5:18 PM IST

పిల్లలు ఆదాయ వనరు కాదు.. పనికి పంపొద్దు: సుచరిత
పిల్లలు ఆదాయ వనరు కాదు.. పనికి పంపొద్దు: సుచరిత

గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ తో కలిసి హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. బాలకార్మికుల విముక్తి కోసం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో 16వేల మంది చిన్నారులను గుర్తించామని హోంమంత్రి చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పకపోతే బాలనేరస్థులుగా మారి సమాజానికి రుగ్మతగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. పిల్లల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని.. వారికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా బంగారు భవిష్యత్​కు బాటలు వేస్తోందని హోంమంత్రి సుచరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details