ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల్లో పోటీ తత్వం నింపే బాలోత్సవం - హోం మంత్రి మేకతోటి సుచరిత తాజా వార్తలు

చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచే విధంగా బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలోని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలోత్సవ - 2020 కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

home minister sucharitha in balotsavam-2020
బాలోత్సవ - 2020 కార్యక్రమాన్ని ప్రారంభించిన హోం మంత్రి

By

Published : Mar 1, 2020, 3:01 PM IST

బాలోత్సవ - 2020 కార్యక్రమాన్ని ప్రారంభించిన హోం మంత్రి

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు బాలోత్సవం ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ అనూరాధ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details