ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళా ఉద్యోగి పై దాడిని ఖండించిన హోంమంత్రి సుచరిత

By

Published : Jun 30, 2020, 7:18 PM IST

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై జరిగిన దాడి బాధాకరమని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

Home minister Sucharitha condemns attack on female employee
హోంమంత్రి మేకతోటి సుచరిత

మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్ఛరించారు. నెల్లూరు జిల్లా పర్యటకశాఖ కార్యాలయంలో ఉద్యోగినిపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు ఆమె తెలిపారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత

రాష్ట్రంలో దిశ చట్టాన్ని ఆములు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని... అందుకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఉందని తెలిపారు. దిశ చట్టం ఆమల్లో భాగంగా 18 దిశ స్టేషన్లు, 4 ఫోరెన్సిక్ ల్యాబ్​లు, 13 జిల్లాలో 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. దిశ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన వెంటనే విచారం చేపట్టి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గుంటూరులో యువతి నీలి చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఇవీ చదవండి:మహిళా ఉద్యోగిపై దాడి జరిగిన 4 రోజులకా స్పందించేది?: సోమిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details