ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ వర్దంతి.. హోంమంత్రి సుచరిత నివాళి - గుంటూరు జిల్లా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్దంతి తాజా వార్తలు

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 64వ వర్దంతిని గుంటూరు లాడ్జి సెంటర్​లో నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Dr. BR Ambedkar 64th birth anniversary
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్​కు నివాళులర్పించిన హోంమంత్రి సుచరిత

By

Published : Dec 6, 2020, 5:06 PM IST

పరిపాలన సక్రమంగా సాగితేనే.. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాజ్యాంగ నిర్మాత వర్దంతిని పురస్కరించుకొని గుంటూరు లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడు లేని విదంగా విద్యా రంగానికి సీఎం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం కేటాయిస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పలువురు నాయుకులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details