మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన దిశ మొబైల్ యాప్(Disha mobile app) ను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత(Home Minister Sucharita) తెలిపారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రూపొందించిన ప్రచార సామగ్రిని.. హోంమంత్రి గుంటూరులోని తన నివాసంలో ఆవిష్కరించారు.
'దిశ యాప్ను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం'
దిశ మొబైల్ యాప్(Disha mobile app)ను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టనట్లు హోంమంత్రి సుచరిత(Home Minister Sucharita) తెలిపారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రూపొందించిన ప్రచార సామగ్రిని అవిష్కరించారు.
హోంమంత్రి సుచరిత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వర రాజు తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, అత్యాచార బాధితులకు న్యాయ సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులకు హోంమంత్రి చేతుల మీదుగా ఐడి కార్డులు, నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి హోంమంత్రి మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి