గుంటూరు జిల్లా పెదనందిపాడులో రైతుభరోసా కేంద్రం నిర్మాణం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆలయం పక్కన ఉన్న స్థలంలో ఆర్బీకే నిర్మాణానికి అధికారులు భూమిపూజ ఏర్పాట్లు చేయగా.. గ్రామస్తులు అడ్డుకునేందుకు యత్నించారు. కొంతకాలంగా ఆ స్థలం దైవ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని.. ఆర్బీకే వేరే స్థలంలో నిర్మించాలని కోరారు. భూమిపూజ కోసం హోంమంత్రి సుచరిత రాగా.. ఆమె పర్యటన అడ్డుకునే అవకాశం ఉందన్న అనుమానంతో మహిళలను పోలీసులు నిర్బంధించారు. అనంతరం సుచరిత ఆర్బీకేకు భూమిపూజ చేశారు.
అనంతరం ప్రసంగించిన హోంమంత్రి.. ఆ స్థలం దేవదాయశాఖకు చెందింది కాదని, పంచాయతీ స్థలం కాబట్టే రైతుభరోసా కేంద్రం నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయాలని చూడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.