ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రిక 'విద్య' అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ముగింపు సందర్భంగా ఆమె గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. విద్యలో దేశ నిష్పత్తి కంటే రాష్ట్రం వెనకబడి ఉందని చెప్పారు. విడతల వారిగా పాఠశాలల అభివృద్ధికి 3500 కోట్లు కేటాయించామన్నారు. అమ్మఒడి పథకంలో విద్యార్థుల తల్లులకు జనవరిలో నగదు జమ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరోవ తరగతి వరకు ఆంగ్ల బోధన ప్రవేశపెట్టనున్నామని స్పష్టంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సాహిస్తామని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఫోన్లు, కంప్యూటర్ల వద్ద ఆటలు ఆడుతున్నారని, వాటికి దూరంగా ఉండాలని హితబోధ చేశారు. మైదానానికి వెళ్లి ఆటలు ఆడాలని సూచించారు. ప్రత్తిపాడు జడ్పీ పాఠశాలలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: హోంమంత్రి - గుంటూరు జిల్లాలో రాష్ట్ర ఖోఖో పోటీల తాజా వార్తలు
గుంటూరు జిల్లా రాష్ట్ర ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. కంప్యూటర్లు, ఫోన్లలో విద్యార్థులు మునిగిపోకుండా మైదానానికి వెళ్లి ఆడుకోవాలని హితవుపలికారు. ప్రత్తిపాడు జడ్పీ హైస్కూల్‌కి మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: హోంమంత్రి సుచరిత