ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో 'అమ్మఒడి' రెండో విడత ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి రెండో విడత చెక్కుల పంపిణీ ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొని.. విద్యార్థులకు చెక్కులు అందించారు.

second term ammavodi program
అమ్మఒడి రెండో విడత చెక్కులు పంపిణీ

By

Published : Jan 11, 2021, 4:25 PM IST

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేందుకు, డ్రాప్​ అవుట్లు తగ్గించేందుకు అమ్మ ఒడి పథకం దోహదపడిందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అమ్మఒడి రెండో విడత ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకం ఓ వరంగా మారిందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం నెరవేరుస్తున్నారని అన్నారు.

నాడు -నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. బడి రూపు రేఖలు మారుస్తున్నారని మంత్రి సుచరిత తెలిపారు. గతంలో ఎప్పుడూలేని విధంగా విద్యారంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. అమ్మఒడి పథకం వల్ల 2లక్షల 40వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి హోం మంత్రి.. విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:అమ్మఒడి రెండో విడత చెల్లింపులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details