మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ ఎస్ఓఎస్ యాప్ను, రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు హోం శాఖ మంత్రి సుచరిత వెల్లడించారు. నరసరావుపేటలో దిశ మహిళా పోలీసు స్టేషన్ను ప్రారంభించిన ఆమె.. లక్షకు పైగా మహిళలు ఈ యాప్ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్షం అనవసరంగా దిశ చట్టంపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్రెడ్డి 11 వేల 500 మంది మహిళా వాలంటరీలకు.. గ్రామ సచివాలయాల్లో ఉపాధి కల్పించారన్నారు.
'మహిళల దిశ మార్చనున్న దిశ చట్టం' - హోంమంత్రి మేకతోటి సుచరిత తాజా వ్యాఖ్యలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ మహిళా పోలీసు స్టేషన్ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విడదల రజని, బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.
నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన హోం మంత్రి