గుంటూరు రూరల్ మండలం పరిధిలో హోంమంత్రి మేకతోటి సుచరిత మాస్కులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు లక్ష 6 వేల మాస్కులు పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి 3 మాస్కుల చొప్పున అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి: హోంమంత్రి - గుంటూరులో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో మాస్కుల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి...కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

home-minister-