సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించే భాద్యత మీదే..హోమంత్రి - sucharitha
నవరత్నాలతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించే బాధ్యత గ్రామవాలంటీర్లదేనని హోమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం పరిధిలో వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన వారికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు.
home
ప్రజల అవసరాలను, ఇతర సమస్యలను గుర్తించి ..వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి .. నెరవేర్చే బాధ్యత వాలంటీర్లు తీసుకుంటారని హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో వాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత...జన్మభూమి కమిటీల మాదిరిగా ప్రవర్తిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. కులమతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరీకీ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు.