ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: గుంటూరు జిల్లాలో హిజ్రా దారుణ హత్య - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు

గుంటూరు వెంకటాద్రి పేటలో హిజ్రా చందనను... దుపాటి క్లిమంత్ అనే యువకుడు హత్య చేశాడు. వెంటపడి వేధిస్తున్న హిజ్రా తీరును భరించలేక.. అతను రోకలి బండతో కొట్టి చంపాడు.

Hizra murdered in Gunturu district
Hizra murdered in Gunturu district

By

Published : Aug 17, 2021, 10:34 AM IST

Updated : Aug 17, 2021, 1:30 PM IST

గుంటూరు వెంకటాద్రిపేటలో హిజ్రా హత్య స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి పేటలో నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో కోరుకొండ చంద్రశేఖర్ ( 32 ) అలియాస్ చందన అనే హిజ్రాని దుపాటి క్లిమంత్ ( 21) అనే యువకుడు రోకలి బండతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. హిజ్రా చందన, దుపాటి క్లిమంత్ కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి యువకుడు తన వద్దకు రావడం లేదని హిజ్రా వేధించడం మొదలుపెట్టింది.

వెంటపడి వేధిస్తున్న ఆ హిజ్రా తీరును భరించలేకపోయిన క్లిమంత్.. నిన్న రాత్రి రోకలి బండతో కొట్టి చంపాడు. ఆ తరువాత తానే స్వయంగా కొత్తపేట పోలీ స్టేషన్​కి వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని కొత్తపేట సిఐ శ్రీనివాసులు తెలిపారు.

Last Updated : Aug 17, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details