ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది'

కరోనా కారణంగా 43శాతం మంది ప్రజలు ఆదాయం 60 శాతం మేర కోల్పోయినట్లు సర్వేలో వెల్లడైనట్లు హిందూ కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి వేణుగోపాల్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ షాపింగ్, కాస్మోటిక్స్, వస్త్రాలు, వినోదం, పర్యాటకం వంటి వాటిపై ఖర్చులు చాలావరకు తగ్గిపోయినట్లు వివరించారు.

guntur district
ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది'

By

Published : Jul 7, 2020, 9:39 PM IST

కరోనా కారణంగా దేశంలో ఆర్థిక రంగం ఎలా కుదేలైంది.. ఏయే రంగాలు ప్రభావితమయ్యాయి అనే అంశంపై గుంటూరులోని హిందూ కళాశాల ఆర్థిక శాస్త్రవిభాగం సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 94 జిల్లాల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ఆర్థికశాస్త్ర విభాగాధిపతి వేణుగోపాల్ పర్యవేక్షణలో ఈ సర్వే సాగింది. అందుకు సంబంధించిన నివేదికను కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తికి అందజేశారు.

కరోనా కారణంగా 43శాతం మంది ప్రజల ఆదాయం 60శాతం మేర కోల్పోయినట్లు సర్వేలో వెల్లడైనట్లు వేణుగోపాల్ తెలిపారు. మరో 37 శాతం మందికి 60నుంచి 100శాతం మేర ఆదాయం తగ్గినట్లు తేలిందన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ షాపింగ్, కాస్మోటిక్స్, వస్త్రాలు, వినోదం, పర్యాటకం వంటి వాటిపై ఖర్చులు చాలావరకు తగ్గిపోయినట్లు వివరించారు. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. కిరాణా సరుకులు, కూరగాయలు, పోషక పానీయాల వినియోగం.. వాటిపై చేసే ఖర్చు పెరిగినట్లు వివరించారు. సర్వే నివేదకను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తత అవసరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details