High Court Fire On AP Government: రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారులకు బకాయిలు,. విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు చెల్లించకుండా వారిని జేబు దొంగలుగా మారుస్తోందని.. హైకోర్టు తీవ్ర వ్యాఖలు చేసింది. బిల్లుల చెల్లింపులో జాప్యంపై మండిపడింది. ఆర్థిక ఇబ్బందుల్లేవని అసెంబ్లీ వేదికగా మంత్రులు చెబుతున్నారని,.. మరి గుత్తేదారులు, ఉద్యోగులు, పింఛనర్లకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీసింది. బకాయిల కోసం ప్రతి ఒక్కరు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందని ప్రశ్నించింది.
బకాయిలు చెల్లించక ప్రభుత్వమే వారిని దొంగలుగా మారుస్తోంది.. హైకోర్టు ఘాటు వ్యాఖ్య
High Court Fire On AP Government: రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యంపై మండిపడింది. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవని అసెంబ్లీ వేదికగా మంత్రులు చెబుతున్నారు.. మరి గుత్తేదారులకు, ఉద్యోగులకు, పింఛనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని నిలదీసింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి బందువుల ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారని..ఘాటుగా వ్యాఖ్యానించింది.
విశాఖ జిల్లా నాతవరం గ్రామానికి చెందిన సివిల్ గుత్తేదారు రమణ.. తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గత ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన.. ఏపీ విద్య, సంక్షేమ, మౌలికాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ దీవన్‌రెడ్డి,. బకాయిల చెల్లింపునకు వారం సమయం కోరారు. కోర్టు పిలిచినప్పుడు వచ్చి.. బిల్లులు చెల్లిస్తామనడం అలవాటుగా మారిందని.. హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ తీరుతో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ఆక్షేపించింది. రహదారులు, భవనాలశాఖలో పనులు చేసినందుకు.. 2 కోట్ల 33 లక్షల బిల్లులు ఇవ్వకపోవడంతో.. ఓ గుత్తేదారు సొంత మేనత్త ఇంట్లో దొంగతనం చేసినట్లు పత్రికలో వచ్చిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: