ఎస్సీ కార్పొరేషన్ నిధులు నవరత్నాలకు ఎలా మళ్లిస్తారు: హైకోర్టు - హైకోర్టు వార్తలు
21:09 January 06
ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడం మంచిదన్న హైకోర్టు
High Court on SC Corporation Funds: ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లింపుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ పోటీపరీక్షల శిక్షణకు బిల్లులు ఇవ్వడం లేదని.. ఎస్సీ కార్పొరేషన్ నిధులు నవరత్నాలకు మళ్లిస్తున్నారని ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని ఈ సందర్బంగా హైకోర్టు ప్రశ్నించింది. నిధులు మళ్లించేందుకు వీల్లేదని 2003లోనే స్పష్టం చేశామని ధర్మాసనం తెలిపింది. రూ.7 వేల కోట్ల బడ్జెట్‌లో స్వయం ఉపాధికి ఏమీ ఖర్చు చేయలేదా అని ప్రశ్నించింది. ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు.. దాన్ని మూసేయడం మంచిదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్పొరేషన్లు నామమాత్రంగా మారిపోయాయని.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రజాధనం వృథా చేయడమేనని తెలిపింది. బిల్లులు చెల్లింపు వివరాలతో అదనపు అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి: