ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగ్గురు వ్యక్తుల అదృశ్యం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగింత

గుంటూరులో ముగ్గురు వ్యక్తుల అదృశ్యం కేసుపై దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన న్యాయాధికారి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఆ నివేదికకు, పోలీసులు తెలిపిన వివరాలకు పొంతన లేదని సీబీఐ విచారణకు ధర్మాసనం ఆదేశించింది.

High Court Ordered CBI to Investigate Guntur Missing case
ఆ కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం

By

Published : Feb 25, 2020, 11:32 PM IST

Updated : Feb 25, 2020, 11:47 PM IST

గుంటూరులో ముగ్గురు వ్యక్తుల అదృశ్యం కేసుపై దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడ్డారన్న ఆరోపణలతో గతేడాది అక్టోబర్​లో ముగ్గురిని గుంటూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 రోజులైనా ముగ్గురి జాడ తెలియని కారణంగా వారి బంధువులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ యువకులు క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్నారంటూ చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాధితులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు... ఘటనపై జ్యుడీషియల్​ విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపిన న్యాయాధికారి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఆ నివేదికకు, పోలీసులు తెలిపిన వివరాలకు పొంతన లేదని సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.

Last Updated : Feb 25, 2020, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details