వైకాపాలో ఆధిపత్య పోరు కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బయ్యపై 4 రోజులక్రితం ప్రత్యర్థులు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. బుధవారం రాత్రి మరణించాడు. సుబ్బారావు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం నేడు గ్రామానికి తీసుకొచ్చారు.
ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి.. గ్రామంలో ఉద్రిక్తత - బలిజేపల్లిలో హై టెన్షన్
గుంటూరు జిల్లా బలిజేపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 4 రోజుల క్రితం ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని అంత్యక్రియల సమయంలో మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. గ్రామంలో భారీగా మోహరించారు.
ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
అయితే ఈ క్రమంలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్తగా కొంతమంది స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ప్రత్యర్థి వర్గంలోని 40 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లినట్లు సమాచారం.
ఇవీ చదవండి... : చీరాలలో రెడ్జోన్ను ప్రకటించిన అధికారులు